![]() |
![]() |

బుల్లితెర మెగాస్టార్ గా పిలువబడే ఈటీవీ ప్రభాకర్ అందరికి సుపరిచితమే. తెలుగు టీవీ ఇండస్ట్రీలో మొట్ట మొదటగా ప్రభాకర్ తోనే చాలా సీరియల్స్ మొదలయ్యాయనడంలో ఆశ్చర్యం లేదు. ఈటీవీలో వచ్చిన చాలా సీరియల్స్ ప్రభాకర్ ద్వారానే మొదలయ్యాయి. చాలా కాలం పాటు ఆ ఛానెల్ లో వర్క్ చేశాడు ఫ్రభాకర్. అందుకే అతనిని అందరు ఈటీవీ ప్రభాకర్ అంటారు. ప్రభాకర్ హైదరాబాద్ కి చదువుకోసం వచ్చి ఫ్రెండ్స్ ప్రోత్సహం వల్ల ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
బుల్లితెరలో కొన్ని సంవత్సరాల పాటు నటించి.. ఒకనొక దశలో బుల్లితెరని ఏలిన యాక్టర్ ప్రభాకర్. ఇతని మొదటి సీరియల్ చాణక్య. తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అంటే "ఋతురాగాలు" అని చెప్పొచ్చు. అప్పట్లో ఆ సీరియల్ కి ఉన్నా క్రేజ్ అంత ఇంత కాదు. ఆ తర్వాత పలు షోస్ కి వ్యాఖ్యతగా చేసి తనలోని మరొక ట్యాలెంట్ ని బయటకు తీసాడు. ఆ తర్వాత మలయజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభాకర్. ఇతను ఒక డైరెక్టర్ గా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. ఒక యాక్టర్ డైరెక్టర్, యాంకర్, ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్ నటించిన 'ఆపరేషన్ దుర్యోధన' లో పోలీస్ క్యారెక్టర్ చేసి ఉత్తమ సహాయ నటుడిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటుడిగా చేశాడు ప్రభాకర్. అయితే తాజాగా ప్రభాకర్ తన కొడుకు చంద్రహస్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాకర్ కొడుకు ఓవర్ యాక్షన్ చేశాడు. అది చూసిన నెటిజన్లు ఫుల్ ట్రోల్స్ చేసారు. దాంతో మీ ట్రోల్స్ కి దండం అంటూ అప్పట్లో ప్రభాకర్ ఒక వీడియోకి చేశాడు. అంతగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రభాకర్ భార్య మలయజ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు తన ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూనే ఉంటుంది.
బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఒక సీనియర్ నటుడిని గానీ నటిని గానీ తీసుకోవడం జరుగుతుంది కానీ ఆ సీనియర్ నటులు హౌస్ లో ఎక్కువ రోజులు ఉండరు. మిగతా కంటెస్టెంట్ తో కలిసిపోలేక ఒకటి రెండు వారాల్లోనే బయటకు వస్తున్నారు. అయితే ఈ సీజన్ లో బుల్లి తెర మెగాస్టార్ అయిన ప్రభాకర్ బిగ్ బాస్ లోకి వెళ్ళనున్నట్లు సమాచారం. మరి ప్రభాకర్ హౌస్ లోకి వెళ్తే కొత్త కంటెస్టెంట్స్ తో ఉండగలడా? ఉంటే ఎన్ని రోజులు ఉంటాడనే సందేహాలు అందరిలోను నెలకొంది. బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి క్యూరియాసిటిని పెంచేస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రభాకర్ హౌస్ లోకి వెళ్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
![]() |
![]() |